అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
మా ఇంటికి వచ్చింది
తైతక్కలాడింది ఎవరది?
చెప్పుకోండి చూద్దాం?
మా నానమ్మ నన్ను చిన్నప్పుడు ఎప్పుడూ అడిగే ప్రశ్న ఇది. తను అలా అడిగినప్పుడల్లా రెండు చేతులూ నడుము పై పెట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ కవ్వం అని చెప్పేదాన్ని , చెప్పినప్పుడల్లా నాకు బెల్లం ఉండలు పెట్టేది
మా నానమ్మ మంచి అందగత్తె . నాకు ఎలా తెలుసనా , తన ఫోటో ఉండేదిలే , పాతది . మా తాతయ్య తో తీయించుకున్ది . మనిషి మంచి రంగు . నాకు ఊహ తెలిసే పాటికే తను చాలా వయసైపొఇన్ది , కాని నాకు ఎప్పుడూ భలే అనిపించేది . అప్పటికి కుడా స్నానం చేసిందంటే గంట పట్టేది . చీర కట్టుకోడానికి ఒక అరగంట . తరవాత తన సవరాన్ని చక్కగా దువ్వుకుని దాన్ని తన జడకి పెట్టి చక్కగా ముడి వేసి , పూలు పెట్టుకుని , ఇంత బొట్టు దిద్దుకుని, అద్దమ్ చూసుకున్తె కానీ తృప్తి పడేది కాదు . రొజూ ఇదో ప్రోగ్రాం తనకి . నాకు తను అలా రెడీ అవుతుంటే చూడడం భలే సరదాగా వుండేది .
తన వొళ్ళో కూర్చున్నప్పుదు తన నుండి వచ్చే మైసూర్ శాండల్ వాసన, గంజి పెట్టి ఇస్త్రే చేసిన చీర వాసనా కలిసి గమ్మత్తుగా ఉండేవి . అచ్చు m.s .సుబ్బలక్ష్మి గారిలా వుండేది మా నానమ్మ . నిండు విగ్రహం . ఎన్నో కబుర్లు చెప్పేది . అన్నీ తమాషా కబుర్లు . నేను ఏమి చేసినా ఆశ్చర్యమే తనకి . నేను చిటిక వేస్తే బుగ్గలు నోక్కేస్కునేది , నేను ఈల వేస్తే ఔరా ? ఏమి పిల్లమ్మా , అని నా బుగ్గలు కూదా నొక్కేసేది .
మా నానమ్మ కవ్వం చిలుకుతుంటే ఎంత ముచ్చటగా వుండేదో , ఒక రిధం లో దాన్ని తిప్పుతూ , తను తిరిగేది . చివర్లో నా చేతికి ఇచ్చి నాచేత కూదా చిలికిన్చేది . నేను వచ్చీ రాక చిలుకుతుంటే
మజ్జిగ చిలుకూ గొల్ల భామ
వెన్నని తియ్యి గొల్ల భామ
కృష్ణుని కియ్యి గొల్ల భామా
అని పాడేది .
ఆవిడ ఎం చేసినా నాకు భలే సరదాగా ఉండేది . వేసవి సెలవులోస్తే ఇప్పటికీ నాకు మా నానమ్మ , అమ్మమ్మ లే గుర్తొస్తారు . తను పచ్చల్లన్నీ రోట్లో నే రుబ్బేది , ఆ రుచి మిక్సి లో రాదనేది . తను రోట్లో పచ్చడి రుబ్బుతుంటే ఆమె చేతి మట్టి గాజులు ఒక మంచి శ్రుతి లో మోగేవి , వాటి శబ్దాన్ని బట్టి అయ్యిందో లేదో తెలిసిపోయేది నాకు .

మా ఊరికి ఒక తాత వచ్చేవాడు , గాజుల తాత . ఆయన దగ్గర ఎన్ని గాజులు ఉండేవో . ఆయన ఎప్పుడు వచ్చినా మా ఇంటి ముందు వీధి అరుగు మీద పెట్టేవాడు గాజులు తెచ్చిన సంచి . ఎంత తమాషాగా పెట్టేవాడో గాజులు . ఆతను గాజులు తియ్యడం ,మళ్లీ వాటిని సర్దడం భలే గమ్మతుగా చేసేవాడు . అతను గాజులు తీసి వేసే పద్ధతి భలే చిత్రం గా వుండేది నాకు . ఎన్ని రంగులు ఉండేవో ,అతని దగ్గర . ఊర్లొ అందరూ వచ్చి వేయించుకునేవారు . "నానమ్మ ఏ రంగు కావాలే నీకు అంటే ",, "ఇది , అః కాదు అది అహహ కాదు కాదు ఇంకోటి" అని చంపెసేదాన్ని . మరి అన్ని రంగులు ఉండేవి అతని దగ్గర . చివరికి ఒక రంగు సెలెక్టు చేస్కుంటే ,అతను చాలా చక్కగా చెయ్యి పట్టుకుని, (అసలు పట్టుకున్నట్టు ఉండేదే కాదు) గాజులు తొడిగే వాడు . మా నానమ్మ మాత్రం ఎప్పుడూ ఎర్ర సాదా గాజులే కొనుక్కునేది . ఆ గాజుల తాతయ్య డబ్బులు తీస్కునేవాడు కాదు , బియ్యమో, బెల్లమొ లేక చింతపండో అలా తీస్కునేవాడు .
నేను 6థ్ క్లాసు వచ్చేవరకి కూడా ఇసుక్రీం వాడు ,ఈత పళ్ళ వాడు, పీచు మిటాయ్ వాడు వీటినే తీస్కునే వారు , డబ్బులకి బదులు .
నానమ్మ కోళ్ళను పెంచేది . మేం వచ్చేసరికి ఒక కోడి పిల్లలతో వుండేది . పిల్లల కోడి అంటే నాకు భయం , అస్సలు దగ్గరికి రానిచ్చేది కాదు . పొడిచేది . నాకేమో చిన్ని చిన్ని కోడిపిల్లల్ని పట్టుకోవాలనిపించేది . మా నానమ్మ ఎలాగో ఒక పిల్లని పట్టి నాకిచ్చేది . నన్ను ఒళ్లో కూర్చొపెత్తుకుని అరచేతి లో కోడి పిల్లని పెట్టేది . భలే చక్కలిగింతలు పుట్టేవి కోడిపిల్ల చేతిలో వున్తె. తర్వాత వదిలేసేవాళ్ళం . మిగతా కోళ్ళకు నేనే రొజూ వడ్ల గింజలు వేసేదాన్ని .
రాత్రి పూట డాబా పైన పడుకుని కధలు చెప్తూ ఉంటే ఊ కొడుతూ నిద్రపోవడం ఇంకా గుర్తు . ఎప్పుడూ ఒకే కధ చెప్పించుకునేదాన్ని , పుటుక్కు జరజర డుబుక్కు కథ . ఇంకో కధ చెప్పనిచ్చేదాన్నికాను .
మా డాబా అంటే గుర్తొచింది , ఎన్ని చుక్కలు ఉండేవో . ఓస్ చుక్కలు మేం కూడా చూసాం అంటే నేనొప్పుకోను , ఎందుకంటే పల్లెల్లో నేను చూసినన్ని చుక్కల్ని మల్లి ఎక్కడా చూళ్ళేదు . బ్లాక్ కాన్వాస్ బోర్డు మీద చమ్కీ పవుడరు పడిపోతే ఎలా ఉంటుందో అల ఉండేది ఆకాశం .అప్పుడప్పుడూ మిణుగురు పురుగు కిందకి వస్తే చుక్క రాలిపొఇన్ది అని సంబర పడేదాన్ని, నానమ్మ నవ్వేసేది . వేసవిలో మబ్బులుండవు కదా ఇంకా బావుండేది .
ఇన్ని చుకల్లెక్కదివే నానమ్మా అంటే "దేవుడు మెడలో వజ్రాల హారం ఉడిపోయి వజ్రాలన్నీ అలా రాలిపోయాయి అని చెప్పేది . ఆ కబుర్లన్నీ విని పడుకుంటే ఎంత మంచి కలలు , చందమామ కలలు ఈస్ట్ మాన్ కలర్ లో వచ్చేవి .
వెన్న తీసిపెడితే చెప్పకుండా తినేసి , అజీర్తి చేసేది నాకు , అప్పుడు వెన్న గిన్నిని ఉట్టిలో పెట్టేది మా నానమ్మ . అది ఊగుతూ వుంటే నాకు నోరు ఊరిపోయేది. అందుకే నాకు రేషన్ పెట్టేది , రోజు సాయంత్రం కొంచం వెన్నపూస లో చెక్కర వేసి ఇచ్చేది . మా నానమ్మ బంగారు .
నాకు పొడుగు జడ వుండాలని మా నానమ్మ కోరిక , కాదు కాదు ఆర్డరు .
నా జడలో పూలు ఉండాలని మల్లె చెత్తుకూదా నాటించింది . నేను వేసవికి వచ్చేసరికి అది పూసేది .రొజూ పూలు కోయించి నాకు పెట్టేది .
భలే నవ్వేది తను .... అలా నవ్వుతూ నే వెళ్లి పోయింది ..... జ్ఞాపకాలని మాత్రం ఉంచేసి ...
తను నాటిన మల్లె చెట్టు ఇంకా నాకు పూలు ఇస్తూనే ఉంది . మా నానమ్మ గుర్తు గా వున్న దానికోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టాను మా ఊర్లో మేం లేనప్పుడు నీళ్ళు పొయ్యడానికి ... మా ఆయన నన్ను చూడడానికి పెల్లిచూపులకి వచినప్పుడు కూడా ఆ చెట్టు పూలే పెట్టుకున్నా , అదో తృప్తి . .... ఇప్పటికీ ఎప్పుడు మా ఊరు వదిలి వెళ్ళినా కూడా ఆ చెట్టుకి చెప్పే వెళ్తాను ... ఎవరి నమ్మకం వాళ్ళది...
తర్వాత ఎప్పుడూ కూడా మా నానమ్మ తిప్పినంత అందంగా కవ్వం తిప్పే గొల్ల భామని నేను చూడలేదు.... అసలు కవ్వాలే లేవూ .............
అడవిలో పెరిగింది
మా ఇంటికి వచ్చింది
తైతక్కలాడింది ఎవరది?
చెప్పుకోండి చూద్దాం?
మా నానమ్మ నన్ను చిన్నప్పుడు ఎప్పుడూ అడిగే ప్రశ్న ఇది. తను అలా అడిగినప్పుడల్లా రెండు చేతులూ నడుము పై పెట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ కవ్వం అని చెప్పేదాన్ని , చెప్పినప్పుడల్లా నాకు బెల్లం ఉండలు పెట్టేది
మా నానమ్మ మంచి అందగత్తె . నాకు ఎలా తెలుసనా , తన ఫోటో ఉండేదిలే , పాతది . మా తాతయ్య తో తీయించుకున్ది . మనిషి మంచి రంగు . నాకు ఊహ తెలిసే పాటికే తను చాలా వయసైపొఇన్ది , కాని నాకు ఎప్పుడూ భలే అనిపించేది . అప్పటికి కుడా స్నానం చేసిందంటే గంట పట్టేది . చీర కట్టుకోడానికి ఒక అరగంట . తరవాత తన సవరాన్ని చక్కగా దువ్వుకుని దాన్ని తన జడకి పెట్టి చక్కగా ముడి వేసి , పూలు పెట్టుకుని , ఇంత బొట్టు దిద్దుకుని, అద్దమ్ చూసుకున్తె కానీ తృప్తి పడేది కాదు . రొజూ ఇదో ప్రోగ్రాం తనకి . నాకు తను అలా రెడీ అవుతుంటే చూడడం భలే సరదాగా వుండేది .
తన వొళ్ళో కూర్చున్నప్పుదు తన నుండి వచ్చే మైసూర్ శాండల్ వాసన, గంజి పెట్టి ఇస్త్రే చేసిన చీర వాసనా కలిసి గమ్మత్తుగా ఉండేవి . అచ్చు m.s .సుబ్బలక్ష్మి గారిలా వుండేది మా నానమ్మ . నిండు విగ్రహం . ఎన్నో కబుర్లు చెప్పేది . అన్నీ తమాషా కబుర్లు . నేను ఏమి చేసినా ఆశ్చర్యమే తనకి . నేను చిటిక వేస్తే బుగ్గలు నోక్కేస్కునేది , నేను ఈల వేస్తే ఔరా ? ఏమి పిల్లమ్మా , అని నా బుగ్గలు కూదా నొక్కేసేది .
మా నానమ్మ కవ్వం చిలుకుతుంటే ఎంత ముచ్చటగా వుండేదో , ఒక రిధం లో దాన్ని తిప్పుతూ , తను తిరిగేది . చివర్లో నా చేతికి ఇచ్చి నాచేత కూదా చిలికిన్చేది . నేను వచ్చీ రాక చిలుకుతుంటే
మజ్జిగ చిలుకూ గొల్ల భామ
వెన్నని తియ్యి గొల్ల భామ
కృష్ణుని కియ్యి గొల్ల భామా
అని పాడేది .
ఆవిడ ఎం చేసినా నాకు భలే సరదాగా ఉండేది . వేసవి సెలవులోస్తే ఇప్పటికీ నాకు మా నానమ్మ , అమ్మమ్మ లే గుర్తొస్తారు . తను పచ్చల్లన్నీ రోట్లో నే రుబ్బేది , ఆ రుచి మిక్సి లో రాదనేది . తను రోట్లో పచ్చడి రుబ్బుతుంటే ఆమె చేతి మట్టి గాజులు ఒక మంచి శ్రుతి లో మోగేవి , వాటి శబ్దాన్ని బట్టి అయ్యిందో లేదో తెలిసిపోయేది నాకు .

మా ఊరికి ఒక తాత వచ్చేవాడు , గాజుల తాత . ఆయన దగ్గర ఎన్ని గాజులు ఉండేవో . ఆయన ఎప్పుడు వచ్చినా మా ఇంటి ముందు వీధి అరుగు మీద పెట్టేవాడు గాజులు తెచ్చిన సంచి . ఎంత తమాషాగా పెట్టేవాడో గాజులు . ఆతను గాజులు తియ్యడం ,మళ్లీ వాటిని సర్దడం భలే గమ్మతుగా చేసేవాడు . అతను గాజులు తీసి వేసే పద్ధతి భలే చిత్రం గా వుండేది నాకు . ఎన్ని రంగులు ఉండేవో ,అతని దగ్గర . ఊర్లొ అందరూ వచ్చి వేయించుకునేవారు . "నానమ్మ ఏ రంగు కావాలే నీకు అంటే ",, "ఇది , అః కాదు అది అహహ కాదు కాదు ఇంకోటి" అని చంపెసేదాన్ని . మరి అన్ని రంగులు ఉండేవి అతని దగ్గర . చివరికి ఒక రంగు సెలెక్టు చేస్కుంటే ,అతను చాలా చక్కగా చెయ్యి పట్టుకుని, (అసలు పట్టుకున్నట్టు ఉండేదే కాదు) గాజులు తొడిగే వాడు . మా నానమ్మ మాత్రం ఎప్పుడూ ఎర్ర సాదా గాజులే కొనుక్కునేది . ఆ గాజుల తాతయ్య డబ్బులు తీస్కునేవాడు కాదు , బియ్యమో, బెల్లమొ లేక చింతపండో అలా తీస్కునేవాడు .
నేను 6థ్ క్లాసు వచ్చేవరకి కూడా ఇసుక్రీం వాడు ,ఈత పళ్ళ వాడు, పీచు మిటాయ్ వాడు వీటినే తీస్కునే వారు , డబ్బులకి బదులు . నానమ్మ కోళ్ళను పెంచేది . మేం వచ్చేసరికి ఒక కోడి పిల్లలతో వుండేది . పిల్లల కోడి అంటే నాకు భయం , అస్సలు దగ్గరికి రానిచ్చేది కాదు . పొడిచేది . నాకేమో చిన్ని చిన్ని కోడిపిల్లల్ని పట్టుకోవాలనిపించేది . మా నానమ్మ ఎలాగో ఒక పిల్లని పట్టి నాకిచ్చేది . నన్ను ఒళ్లో కూర్చొపెత్తుకుని అరచేతి లో కోడి పిల్లని పెట్టేది . భలే చక్కలిగింతలు పుట్టేవి కోడిపిల్ల చేతిలో వున్తె. తర్వాత వదిలేసేవాళ్ళం . మిగతా కోళ్ళకు నేనే రొజూ వడ్ల గింజలు వేసేదాన్ని .
రాత్రి పూట డాబా పైన పడుకుని కధలు చెప్తూ ఉంటే ఊ కొడుతూ నిద్రపోవడం ఇంకా గుర్తు . ఎప్పుడూ ఒకే కధ చెప్పించుకునేదాన్ని , పుటుక్కు జరజర డుబుక్కు కథ . ఇంకో కధ చెప్పనిచ్చేదాన్నికాను .
ఇన్ని చుకల్లెక్కదివే నానమ్మా అంటే "దేవుడు మెడలో వజ్రాల హారం ఉడిపోయి వజ్రాలన్నీ అలా రాలిపోయాయి అని చెప్పేది . ఆ కబుర్లన్నీ విని పడుకుంటే ఎంత మంచి కలలు , చందమామ కలలు ఈస్ట్ మాన్ కలర్ లో వచ్చేవి .
వెన్న తీసిపెడితే చెప్పకుండా తినేసి , అజీర్తి చేసేది నాకు , అప్పుడు వెన్న గిన్నిని ఉట్టిలో పెట్టేది మా నానమ్మ . అది ఊగుతూ వుంటే నాకు నోరు ఊరిపోయేది. అందుకే నాకు రేషన్ పెట్టేది , రోజు సాయంత్రం కొంచం వెన్నపూస లో చెక్కర వేసి ఇచ్చేది . మా నానమ్మ బంగారు .
నాకు పొడుగు జడ వుండాలని మా నానమ్మ కోరిక , కాదు కాదు ఆర్డరు .
నా జడలో పూలు ఉండాలని మల్లె చెత్తుకూదా నాటించింది . నేను వేసవికి వచ్చేసరికి అది పూసేది .రొజూ పూలు కోయించి నాకు పెట్టేది .
భలే నవ్వేది తను .... అలా నవ్వుతూ నే వెళ్లి పోయింది ..... జ్ఞాపకాలని మాత్రం ఉంచేసి ...
తను నాటిన మల్లె చెట్టు ఇంకా నాకు పూలు ఇస్తూనే ఉంది . మా నానమ్మ గుర్తు గా వున్న దానికోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టాను మా ఊర్లో మేం లేనప్పుడు నీళ్ళు పొయ్యడానికి ... మా ఆయన నన్ను చూడడానికి పెల్లిచూపులకి వచినప్పుడు కూడా ఆ చెట్టు పూలే పెట్టుకున్నా , అదో తృప్తి . .... ఇప్పటికీ ఎప్పుడు మా ఊరు వదిలి వెళ్ళినా కూడా ఆ చెట్టుకి చెప్పే వెళ్తాను ... ఎవరి నమ్మకం వాళ్ళది...
తర్వాత ఎప్పుడూ కూడా మా నానమ్మ తిప్పినంత అందంగా కవ్వం తిప్పే గొల్ల భామని నేను చూడలేదు.... అసలు కవ్వాలే లేవూ .............

.jpg)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి